ఏప్రిల్ చివరి వారంలో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ప్రకటించారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. పలు కీలక అంశాలను వెల్లడించారు. ఆమె ఏమన్నారో చదవండి.

ఏప్రిల్ చివరివారంలో పాదయాత్ర చేసేలా ప్లాన్ చేస్తున్నాను. ఆలంపూర్ టూ ఆదిలాబాద్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలోని ముఖ్య ప్రాంతాలన్నీ కలిపేట్టు పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నాను. ఏ జిల్లా నేతలు ఆ జిల్లా పాదయాత్రలో కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నా.

రూట్ మ్యాప్ పై కసరత్తు సాగుతున్నది. త్వరలోనే రూట్ మ్యాప్ రెడీ అవుతుంది. ఉమ్మడి జిల్లాల్లోని అందరు నేతలతో మాట్లాడుతున్నాను. టిఆర్ఎస్ హామీలు, వాటి అమలు వైఫల్యాలపై ప్రజలకు వివరిస్తాను. ప్రజా సమస్యలు...సర్కార్ సంక్షేమ పథకాల వైపల్యాల పై పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతాను.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. సోనియాగాంధి అనే విషయాన్ని ప్రజలకు చెబుతాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి సోనియా రుణం తీర్చికోండని అప్పీల్ చేస్తాను.