Asianet News TeluguAsianet News Telugu

అవి రౌడీ సమితులు : డికె అరుణ ఫైర్

  • నాలుగేళ్లకు రైతుల కష్టాలపై సోయి వచ్చిందా?
  • రైతు సమన్వయ సమితిల పేరుతో రౌడీ సమితులు
dk aruna fire on formres issue

తెలంగాణ సర్కారు తీరుపై మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఫైర్ అయ్యారు. సిఎల్పీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..

సీఎం కెసిఆర్ కు రైతులను ఆదుకోవాలనే సోయి నాలుగేళ్లు అయినంక వచ్చింది. టిఆర్ఎస్ నాలుగేళ్ల కు రుణమాఫీ చేస్తే అది రుణ వడ్డీ చెల్లింపుల మాఫికే సరిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రౌడీ సమన్వయ సమితిలను ఏర్పాటు చేశారు. వాటీనే రైతు సమన్వయ సమితి అంటున్నారు.

ఎకరాకు నాలుగు వేలు స్కీమ్ వచ్చే ఎన్నికల్లో ఓట్లకోసం తీసుకొచ్చారు. నాలుగు వేలు ఇచ్చినంత మాత్రాన రైతులు నీ పక్షాన ఉంటారనుకుంటే పొరపాటు. నాలుగేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారా...? ఒక్క ఎకరాకు నీళ్ళు అందించారా...? కేవలం ఉన్నవాటి పేర్లు మార్చారు. ప్రాజెక్టుల వ్యయం పెంచారు.

నాలుగేళ్లలో ఏ ఒక్క విద్యుత్ ప్రాజెక్టు నిర్మించారా...? ఒక్క యూనిట్  విద్యుత్ ఉత్పత్తి చేశారా...? ఇచ్చిన హామీ నెరవేర్చకుండా...కొత్త హమీలిస్తున్నారు. సామాన్య ప్రజలను, రైతులను కలవని సీఎం కెసిఆర్ ఒక్కరే. సీఎం మాత్రం ప్రశ్నించొచ్చు...ఆయనను మాత్రం ప్రశ్నించొద్దా? బీజేపీ, టిఆర్ఎస్ దొందూ...దొందే...! రైతులను కాపాడేందుకు సంరక్షణ కమిటీలుగా మారి కాంగ్రెస్ కార్యకర్తలు రైతులకు అండగా ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios