సోనియా తెలంగాణ ఇస్తే దళితుడిని సీఎంని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చొన్నారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ.. ఇవాళ గద్వాలలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను కేసీఆర్ దోపిడికి గురిచేశారని ఆమె ఆరోపించారు.

తెలంగాణ వల్ల బాగుపడింది ఒక్క కేసీఆర్ కుటుంబమేనని అరుణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంబాసిడర్ కారు మార్కెట్‌లో లేదు.. కారు గుర్తులో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్ ఇలా ఐదుగురే పడతారని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆ ఐదుగురు తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడి చేయడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారని అరుణ దుయ్యబట్టారు. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో శాసనసభ్యులు జనాన్ని దోపిడి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.