జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్  మంగళవారం విడుదలైంది. తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని పార్ధసారథి వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుందని దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో ముగియనుండడంతో డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు.

ఎస్టీ (జనరల్): ఫలక్‌నూమా
ఎస్టీ (మహిళ): హస్తినాపురం
ఎస్సీ (జనరల్): కాప్రా, మీర్‌పేట, హెచ్‌బి కాలనీ, జియాగుడ, మచా బొల్లారామ్, వెంకటాపురం
ఎస్సీ (మహిళ): రాజేంద్ర నగర్, కవాడి గుడా, అడ్డాకట్ట, మెట్టుగూడ, బన్సిలాల్‌పేట.
బీసీ (జనరల్): చర్లపల్లి, సిఖ్‌చవానీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, షాలిబండ, గోషామహాల్, పురాణాపూల్, దూద్‌బోలీ, రామ్‌నాస్‌పురా, కిషన్‌బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయ నగర్, కౌర్వాన్, నానల్ నగర్, మెహదిపట్నం, గుడిమల్కాపూర్, అంబర్ పేట, భోలక్‌పూర్, బోరబండ, రామచంద్రాపూర్, పటాన్ చెరు, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, 

బీసీ (మహిళ): రామంతాపూర్, ఓల్డ్ మలక్‌పేట, తలాబ్ చంచాలమ్, గౌలీపురా, కుర్మాగూడ, కంచన్‌బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమాన్ నగర్, అత్తాపూర్, మంగళ్ ఘాట్, గోల్కొండ, టోలీచౌకీ, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్‌నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషిరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రామ్‌గోపాల్ పేట, 

జనరల్ (మహిళ): ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, సరూర్‌నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, ముసారంబాగ్, అజాంపురా, ఐఎస్ సదన్, లంగర్‌హౌస్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్‌పేట, అదిక్ మెట్, గాంధీ నగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వరకాలనీ, సోమాజీగూడ, సంత్ నగర్, హఫీజ్‌పేట, చందానగర్, భారతీ నగర్, బాలాజీ నగర్, అల్లాపూర్, వివేకానంద నగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడీమెట్ల, అల్వాల్, నేరేడ్‌మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతమ్ నగర్, తార్నాక, సీతాఫల్ మండీ, బేగంపేట, మోండా మార్కెట్

జనరల్ కేటగిరీ: మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్తలిపురం, హస్తినాపురం, చంపాపేట, లింగోజీగూడ, కొత్తపేట, చైతన్యపురి, గడ్డి అన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పురా, రెయిన్ బజార్, పట్టార్‌ఘట్టీ, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగమ్ పేట, బేగంబజార్, మైలార్ దేవ్‌పల్లి, జంబాగ్, రామ్‌నగర్, బంజారా హిల్స్, షేక్‌పేట, జూబ్లీ హిల్స్, యూసఫ్‌గూడ, వెంగళ్ రావ్ నగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేర్‌లింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్‌గిరి