Asianet News TeluguAsianet News Telugu

Disha Accused Encounter: స్థలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్

దిశ నిందితులు ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని సిర్పూర్కర్ కమిషన్  పరిశీలించింది.  2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. తమపై కాల్పులు జరిపేందుకు నిందితులు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్  తెలిపారు.
 

Disha Accused Encounter:Sirpurkar Commission Visits Encounter place near Shadnagar
Author
Hyderabad, First Published Dec 5, 2021, 1:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని సిర్పూర్కర్ కమిషన్  ఆదివారం నాడు పరిశీలించింది. సిర్పూర్కర్ కమిషన్ కు కేంద్ర బలగాలు బారీ బందోబస్తును కల్పించాయి. 2019 డిసెంబర్ 6వ తేదీన disha పై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఈ encounter పై హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తోంది. Corona కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది.దీంతో కమిషన్ కు supreme court గడువును పొడిగించిన విషయం తెలిసిందే.

ఇవాళ ఉదయం దిశ నిందితులు ఎన్ కౌంటర్ కు గురైన షాద్ నగర్ కు సమీపంలోని చటాన్ పల్లి ప్రాంతాన్ని  సిర్పూర్కర్ కమిషన్ పరిశీలించింది.  ఇదే ప్రాంతంలో 2019 నవంబర్ 27వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు దుండగులు హత్య చేశారు. మృతదేహం గుర్దు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చారు.  దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన  పరిసర ప్రాంతాలను  కమిషన్ పరిశీలించింది.దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులతో పాటు సైబారాబాద్ సీపీ సజ్జనార్ ను కూడా కమిషన్ విచారించింది. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను కూడా ప్రశ్నించింది.  కాల్పులకు ఎవరూ ఆదేశాలు జారీ చేశారని కూడా  కమిషన్ సభ్యులు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులను ప్రశ్నించింది.

సిర్పూర్కర్ కమిషన్ కు నిరసన సెగ

దిశ నిందితులు  షాద్ నగర్  పోలీస్ స్టేషన్ ను  సిర్పూర్కర్ కమిషన్  పరిశీలించింది. దుర్మార్గులను  ఎన్ కౌంటర్  చేస్తే  తప్పేమిటని స్థానికులు ప్రశ్నించారు. సిర్పూర్కర్ కమిషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిశపై అత్యాచారం చేసిన దారుణంగా హత్య చేసిన నిందితులను  శిక్షిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. దిశపై అత్యాచారం చేసి  హత్య చేసిన నిందితులను శిక్షించాలని  గతంలో తాము నిరసకు దిగిన సమయంలో  తమపై ఆ సమయంలో పోలీసులు తమపై లాఠీచార్జీ చేసిన విషయాన్ని స్థానికులు గుర్తు చేశారు.
 


 

also read:sirpurkar commission విచారణ: 'ఆ ముగ్గురు మైనర్లే, చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారు'

ఎన్ కౌంటర్ లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కూడా కమిషన్ ప్రశ్నించింది. ఎన్ కౌంటర్ లో నిందితులు చనిపోయిన స్థలంలో  ఎక్కువగా గడ్డితో నిండి ఉంది. దీంతో నిందితులు పోలీసుల కళ్లలో మట్టి ఎక్కడ కొట్టారనే విషయమై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నించింది. ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో తీసిన ఫోటోలను కూడా కానిస్టేబుల్ కు చూపింది. దిశపై అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితులు  మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు 2019 డిసెంబర్ 6న ఎన్ కౌంటర్ లో మరణించారు. దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థలంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్టుగా అప్పట్లో సీపీ సజ్జనార్ తెలిపారు.  ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఎన్ కౌంటర్ జరిగిన వారం లోపునే సిర్కూర్సర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారు. సీబీఐ మాజీ చీఫ్ డిఆర్ కార్తికేయన్, ముంబై హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్  ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios