తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. ఈఆర్సీ ఆమోదమే తరువాయి
తెలంగాణ ప్రజలకు షాకిచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు రంగం చేశాయి. ఈఆర్సీ ఆమోదించడమే తరువాయి.

తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలు చేశాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. తెలంగాణ ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావుకు డిస్కంలు నివేదికలు అందజేశాయి. ఎస్పీడీసీపీ, ఎన్పీడీసీఎల్‌లు అందజేసిన ప్రతిపాదనలను వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచుతామన్నారు శ్రీరంగరావు. బహిరంగ విచారణ తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచాలా.. తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండు డిస్కంలు కలిపి రూ.10,535 కోట్ల రెవెన్యూ లోటోతో వున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం డిస్కంలకు ఇచ్చే నిధులను సకాలంలో అందజేస్తాయని శ్రీరంగరావు తెలిపారు. 2023- 24 ఆర్ధిక సంవత్సరానికి రూ.54,060 కోట్ల రెవెన్యూలు డిస్కంలు ఆశిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.