సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఊరికే ఉండరు. ఎప్పుడో ఎవరిమీదో ఒకరి మీద విమర్శలు  చేస్తూ.. సెటైర్లు వేస్తూ ఉంటారు. 

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఊరికే ఉండరు. ఎప్పుడో ఎవరిమీదో ఒకరి మీద విమర్శలు చేస్తూ.. సెటైర్లు వేస్తూ ఉంటారు. నిన్న, మొన్నటి దాకా.. ఏపీ పాలిటిక్స్ పై విమర్శలు చేసిన వర్మ.. తర్వాత లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమాని తెరపైకి తీసుకువచ్చారు. ఆ సినిమా విడుదలను ఏపీలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. మళ్లీ సినిమాను విడుదల చేయాలని ప్రయత్నించగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం సినిమా విడుదల చేయడానికి లేదని చెప్పారు.

దీంతో.. వర్మ ఇప్పుడు తన టార్గెట్ మార్చుకున్నారు. ఇప్పుడే ఏకంగా ప్రధాని నరేంద్రమోదీపై పడిపోయారు. రెండో ప్ర‌పంచ యుద్ధానికి కార‌ణ‌మైన జ‌ర్మ‌నీ అధినేత అడాల్ఫ్ హిట్ల‌ర్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పోల్చాడు వ‌ర్మ‌. అప్ప‌ట్లో హిట్ల‌ర్ ఓ చిన్న‌పాప‌తో తీసుకున్న ఫోటోని.. ప్ర‌ధాని మోదీ ఓ విదేశీ యాత్రలో చిన్నారితో తీసుకున్న ఫోటోతో పోల్చుతూ పోస్ట్ చేశారు. `సేమ్ టు సేమ్‌` అంటూ కామెంట్ కూడా చేశారు రాంగోపాల్ వ‌ర్మ‌. మరి దీనిపై బీజేపీ నేతలు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. 

Scroll to load tweet…