Asianet News TeluguAsianet News Telugu

ఇంత నీచమా??.. కేటీఆర్ పై విరుచుకుపడ్డ తెలంగాణ దిగ్గజం బి. నర్సింగరావు

ప్రముఖ తెలంగాణ దర్శకుడు బి. నర్సింగరావు కేటీఆర్ కు ఓపెన్ లెటర్ రాశారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు అంటూ విరుచుకుపడ్డారు.  

Director B. Narsingrao's open letter to KTR, goes viral - bsb
Author
First Published Jun 10, 2023, 9:22 AM IST

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఫిలాంత్రోపిస్ట్.. దాసి, మా భూమి, రంగులకల సినిమాలతో దశాబ్దాల క్రితమే తెలంగాణ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు బి నరసింగరావు. ఆయన..  ఇప్పుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీద నిప్పులు చెరిగారు…సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.. 

ఆ లేఖ సారాంశం ఇది.. 

‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు
నేను నచ్చలేదా
ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు

40 రోజుల నుండి, ప్రతి రెండు రోజులకు ఒకసారి నిన్ను  అపాయింట్మెంట్ అడిగితే..  నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వవా..? నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు..

రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అన్న విజ్ఞత కూడా ఉండాలి. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణిచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు..

అంత గొప్ప హీనులు నీ సలహాదారులు. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుండి వెలసిన కమలాలు మీరు. మీ గత జాడల (అడుగుల) ఆనవాళ్ళు ఏమిటి? 

ఇవన్నీ రేపు రేపు బహిరంగంగా మాట్లాడుకుందాం..

 బి నర్సింగరావు.. ’

అని కేటీఆర్ కు ఆయన రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత ఆగ్రహం వెనక కారణమేంటని పలువురు చర్చించుకుంటున్నారు.

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. నగదు, మద్యంబాటిళ్లు ఎత్తుకెళ్లిన దొంగలు..

ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా బి నర్సింగరావు పేరు తెలియని తెలంగాణ వ్యక్తి ఉండరు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, ఆర్టిస్టుగా, కవిగా  ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ సినిమాకు దశాదిశాలాంటి చిత్రాలను రూపొందించారు. ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం గతంలో బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది.

ఇప్పటివరకు ఆయనకు నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. అనేక అంతర్జాతీయ గౌరవాలు దక్కాయి. ఆయన రూపొందించిన మాభూమి సినిమాను 1979లోనే కైరో,  సిడ్నీఫిలిం ఫెస్టివల్స్ లో..  కార్లోవీ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు.. సినిమాలు మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లమాను గెలిచాయి.

మా ఊరు అనే సినిమా హంగేరీ అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. 2003లో జరిగిన 56వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బి నరసింగరావు దర్శకత్వం వహించిన హరివిల్లు సినిమా ప్రదర్శనకు ఎంపికైంది.

ఆయన తీసిన రంగుల కల, దాసి, మట్టి మనుషులు సినిమాలకు తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డులు వరించాయి. ఉత్తమ మానవ శాస్త్ర ఎత్నోగ్రాఫిక్ సినిమాగా మా ఊరు సినిమా జాతీయ సినిమా పురస్కారాన్ని దక్కించుకుంది. మాభూమి సినిమా 1979లో ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును దక్కించుకుంది. హరివిల్లు అనే బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడుగా నంది అవార్డు తీసుకున్నారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత ఆర్ట్ ఎట్ తెలంగాణ, బోనాలు, మేడారం జాతర వంటి తెలంగాణ ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని చాటే కాఫీ టేబుల్ సంకలనాలు ప్రచురించారు. తెలంగాణ ప్రచురణల పేరిట అనేక సాహిత్య గ్రంథాలు వెలువరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios