Asianet News TeluguAsianet News Telugu

జగన్, కేటీఆరే నాగార్జున కొంప ముంచారా?

గతంలో నాగార్జున వ్యవహరించిన తీరే ప్రస్తుతం ఆయన కష్టాలకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ఏపీ, తెలంగాణ రాజకీయాలే కారణమంటున్నారు. అది ఎలాగో కూడా వివరిస్తున్నారు.... ఆ వాదన ఇదే... 

Did Jagan and KTR Sink Nagarjuna's Fortunes? AKP
Author
First Published Aug 26, 2024, 8:11 PM IST | Last Updated Aug 26, 2024, 8:11 PM IST

Nagarjuna : అక్కినేని నాగార్జున మంచి హీరో మాత్రమే కాదు మంచి బిజినెస్ మెన్ కూడా అని ఆయన సన్నిహితులు, సినీ  వర్గాల టాక్. పెద్దపెద్ద వ్యాపారాలు చేయకపోయినా తెలివిగా డబ్బులు సంపాదిస్తుంటారని అంటుంటారు. సినిమాలు, బిగ్ బాస్ వంటి షోలు, యాడ్ ల ద్వారా కాకుండా ఆయనకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, మరికొన్ని వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తుంటారు. ఇలా ఆయనకు ఆదాయాన్ని అందించే మార్గాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. నగరంలో బడాబాబులు నివాసముండే మాదాపూర్ లో ఈ కన్వెన్షన్ లో ఒక్కరోజు పంక్షన్ ను కోటి రూపాయల వరకు తీసుకునేవారని టాక్. ఇలా నాగార్జున ఫ్యామిలీకి మంచి ఆదాయాన్ని అందించే ఎన్ కన్వెన్షన్ చెరువును కబ్జాచేసి కట్టారంటూ రేవంత్ ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో ఈ ఎన్ కన్వెన్షన్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.  

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ ఆండ్ అసెట్స్ మానిటరింగ్ ఆండ్ ప్రొటెక్షన్) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఐపిఎస్ అధికారి రంగనాథ్ ను కమీషనర్ గా ఏర్పాటుచేసింది. ఈ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు... దీంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత పనులు చేపట్టింది ఈ సంస్థ. ఇలా అనేకమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా తాజాగా నాగార్జునపై పడింది. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించాడంటూ ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది.   

అయితే హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి నిర్మించిన అనేక భవనాలున్నాయి. వాటన్నింటి జోలికి వెళ్లకుండా కేవలం నాగార్జున కన్వెన్షన్ హాల్ నే హైడ్రా ఎందుకు కూల్చేసారు..? అంటే రాజకీయ కారణాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ నాగార్జున పరిస్థితి ఇలాగే వుందని... ఆయనకు మద్దతుగా నిలిచే పార్టీలు అధికారంలో లేకపోవడమే ఇందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. గతంలో అటు ఏపీలో వైసిపి, ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ తో సన్నిహితంగా మెలిగారు... అదే ఎఫెక్ట్ ఇప్పుడాయనపై పడిందని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

ఎన్ కన్వెన్షన్ వివాదంలోకి సమంత :

హైడ్రా వ్యవహారం రాజకీయ రంగు పులుపుకుంది. ప్రత్యర్థి పార్టీలు, వారికి మద్దతుగా నిలిచే వారి ఆస్తులనే హైడ్రా టార్గెట్ చేసిందనే వాదన మొదలయ్యింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ వ్యవహారంపై బిజెపి ఎంపి రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటిదికాదు... ఎప్పటినుండో అది అక్రమ కట్టడమనే ప్రచారం జరుగుతోంది. హైకోర్టు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రఘునందన్ పేర్కొన్నారు. కానీ ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా... నాగార్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ ను చేసారని అన్నారు. 

ఇలా నాగార్జునతో పాటు సమంత కూడా బిఆర్ఎస్ తో సన్నిహితంగా వుండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు అనేలా రఘునందన్ వ్యాఖ్యలున్నాయి. ఆ ప్రభావమే తాజా ఎన్ కన్వెన్షన్ పై చర్యలు అనేలా బిజెపి ఎంపీ కామెంట్స్ చేసారు. గత ప్రభుత్వంలో నాగార్జున మాజీ కోడలు సమంతకు కీలక బాధ్యతలు దక్కితే... ఈ ప్రభుత్వంలో ఆస్తులు ధ్వంసం అవుతున్నాయంటూ రఘునందన్ రావు వ్యాఖ్యలు వున్నాయి. 

శోభిత ధూళిపాళ్ల కూడా వివాదంలోకి  : 

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో నాగార్జునకు కాబోయే కోడలు శోభిత ధూళిపాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కన్వెన్షన్ కూల్చివేతతో ఆమెపై నిందలు వేస్తున్నారు కొందరు. శోభితతో నాగ చైతన్యకు నిశ్చితార్థం జరిగిన నెల రోజుల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో అశుభం చోటుచేసుకుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెది ఐరన్ లెగ్ అని... ఆమెవల్ల నాగార్జున ఫ్యామిలీ ఇంకెన్ని కష్టాలు పడాలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా పెళ్ళి కాకుండానే ఇంత జరిగిందంటే... పెళ్లయ్యాక పరిస్థితి ఏమిటంటూ శోభితపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఏ తప్పు చేయకుండా, తన ప్రమేయం లేకుండా శోభిత మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితులు ఆమెను  ఇరకాటంలో పెట్టాయి. ముందునుండి నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకోడాన్ని, శోభితతో పెళ్లికి సిద్దమవడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. శోభితను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అక్కినేని వారి ఇంట్లో అడుగు పెట్టకుండానే శోభిత అభాండాలను ఎదుర్కుటోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios