Asianet News TeluguAsianet News Telugu

గణేష్ నిమజ్జనానికి హైటెక్ ఏర్పాట్లు: డీజీపీ


హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిమజ్జనానికి హైటెక్ ఏర్పాటు చేశామని తెలిపారు.  31 జిల్లాల్లో వినాయక నిమజ్జనం ప్రక్రియను డీజీపీ కార్యాలయం నుండి లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

dgp mahendar reddy on Ganesh Immersion
Author
Hyderabad, First Published Sep 22, 2018, 7:56 PM IST

హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నిమజ్జనానికి హైటెక్ ఏర్పాటు చేశామని తెలిపారు. గణనాథుని నిమజ్జనం సందర్భంగా 31 జిల్లాల్లో వినాయక నిమజ్జనం ప్రక్రియను డీజీపీ కార్యాలయం నుండి లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో లోతయినా చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నైజ్డ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లను జియో ట్యాగింగ్ చేసామన్నారు. 

65వేలమంది పోలీసులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లో ఉంటారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలను, అమ్మాయిలను వేధించే పోకిరీలను గుర్తించేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దించామని చెప్పారు. సున్నిత ప్రాంతాలు, వ్యక్తులపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios