దేవరయంజాల్‌ భూముల ఇష్యూ: ఈవో బదిలీ, కీలక ఫైల్స్ స్వాధీనం

దేవరయంజాల్‌ శ్రీసీతారామస్వామి ఆలయంలో పనిచేసిన అధికారులపై ప్రభుత్వం వేటేసింది. దేవాలయానికి చెందిన 1531 ఎకరాల భూమికబ్జాకు గురైన విషయమై రాష్ట్ర ప్రభుత్వం విచారణను మరింత వేగవంతం చేసింది.

Devarayamjal temple Executive officer transferred lns

హైదరాబాద్:  దేవరయంజాల్‌ శ్రీసీతారామస్వామి ఆలయంలో పనిచేసిన అధికారులపై ప్రభుత్వం వేటేసింది. దేవాలయానికి చెందిన 1531 ఎకరాల భూమికబ్జాకు గురైన విషయమై రాష్ట్ర ప్రభుత్వం విచారణను మరింత వేగవంతం చేసింది.మాజీమంత్రి  ఈటల రాజేందర్ తో పాటు ఆయన అనుచరులు ఈ భూములను కబ్జా చేసుకొని  నిర్మాణాలు చేపట్టారనే విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఎఎస్ కమిటీ విచారణను కొనసాగిస్తోంది. బుధవారం నాడు ఐఎఎస్ అధికారుల కమిటీ విచారణను నిర్వహించింది. దేవాలయానికి చెందిన కీలక ఫైల్స్ ను  ఐఎఎస్ కమిటీ స్వాధీనం చేసుకొంది. 

also read:దేవరయంజాల్‌‌ భూముల ఇష్యూ: రెండో రోజూ ఐఎఎస్ కమిటీ విచారణ

ఆలయ ఈవోను తప్పించారు.  దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయానికి ఈవోను  బదిలీ చేశారు. దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని అధికారులు తప్పించారు.ఈ దేవాలయ ఈవో బాధ్యతలను మెదక్ జిల్లా కలెక్టర్‌కి  అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.ఈ భూముల విషయమై రోజువారీ విచారణ కోసం ఇక్కడే తాత్కాలిక కార్యాలయాన్ని ఐఎఎస్ కమిటీ ఏర్పాటు చేసింది.

ఐఎఎస్ కమిటీ విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనుంది. ఇదిలా ఉంటే ఈ భూముల్లో ఈటల రాజేందర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలకు కూడ భూములున్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios