హైదరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ లో వాడే బ్రీత్ అనలైజర్ పై ఇపుడు వాహనదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ యంత్రం విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలను రేకెత్తించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడ బిగ్ బజార్ వద్ద డ్రంకెస్ డ్రైవ్ తనిఖీలు నిర్వహింంచారు. ఈ తనిఖీల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మనువడు జహీరుద్దిన్ ఖాద్రీ పట్టుబడ్డాడు. పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిన్వహించడంతో ఆల్కహాల్ శాతం 43 గా వచ్చింది. అయితే తాను అసలు మద్యం సేవించలేదని జహీరుద్దిన్ పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. అయినా పోలీసులు అతడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే తాను మద్యం తాగకపోయినా తాగానని....తనపై కేసు పెట్టడంతో జహంగీర్ ట్రాఫిక్‌ పోలీసులపై సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యపరీక్షల నిమిత్తం సయ్యద్‌ జహంగీర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యుల పరీక్షల్లో జహంగీర్‌ మద్యం తాగలేదని  నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ వివాదం మరో మలుపు తినరింది.

దీంతో ఈ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు డైలమాలో పడ్డారు. పోలీసుల వద్దగల బ్రీత్ అనలైజర్ లో ఓ రకమైన ఫలితం, ఉస్మానియా వైద్యుల రిపోర్టు మరో రకమైన ఫలితం ఉండటంతో ఏకంగా ఈ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలపైనే ప్రజల్లో అనుమానం రేకెత్తుతోంది. అసలు ఈ బ్రీత్ అనలైజర్ విశ్వసనీయత, ఖచ్చితత్వం పై వాహనదారుల్లో అనుమానం మొదలైంది.