ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్లను సోమవారంనాడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ చార్జీషీట్లలో పలు కీలక అంశాలను ఈడీ ప్రస్తావించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరును కూడా ఈడీ చేర్చింది. రెండవ అదనపు చార్జీషీట్లలో మాగుంట రాఘవ సహా పలువురిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది ఈడీ, మూడో అదనపు చార్జీషీట్లలో అరుణ్ రామచంద్రపిళ్లై పై ఈడీ అభియోగాలు మోపింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరుణ్ రామచంద్రపిళ్లై తదితరులు కీలకంగా వ్యవహరించారని ఈడీ ఈ చార్జీషీట్లలో ఆరోపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై సౌత్ గ్రూప్ ఆప్ పార్టీకి రూ. 100 కోట్లు ముడుపులు ఇచ్చిందని చార్జీషీట్ లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రతినిధిగా వ్యవహరించారని ఈడీ ఆ చార్జీసీట్ లో పేర్కొంది.లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో హైద్రాబాద్ లో భూములు కొన్నారని ఈడీ ఈ చార్జీషీట్ లో పేర్కొంది. ఫీనిక్స్ రియల్ ఏస్టేట్ సంస్థ సీఈఓ శ్రీహరి పేరును కూడా ఈడీ అధికారులు ఈ చార్జీషీట్ లో పేర్కొన్నారు. పీనిక్స్ సంస్థ నుండి కవిత 25 వేల చదరపు అడుగుల ఆస్తిని కొనుగోలు చేసినట్టుగా ఈడీ పేర్కొంది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఈడీ అనుబంధ చార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. వారిపై అభియోగాలు..!!
ఎన్ గ్రోత్ క్యాపిటల్ అనే కంపెనీ ద్వారా ఫినిక్స్ గ్రూప్ నుండి స్థిరాస్తి కొన్నట్టుగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని చార్జీషీట్ లో ఈడీ ప్రస్తావించింది. ఎన్ గ్రోత్ కేపిటల్ లో కవిత భర్త అనిల్ కూడా భాగస్వామి అని ఈడీ చార్జీషీట్ లో తెలిపింది. ఏపీ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డికి ప్రేమ్ రాహుల్ బినామీ అని ఈ చార్జీషీట్ లో ఈడీ ఆరోపించింది.
