Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం‌లో ఈడీ దూకుడు: ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ రెడ్డి ‌, వినయ్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇవాళ ఇద్దరిని అరెస్ట్ చేశారు. శరత్ రెడ్డి ,వినయ్  బాబులను ఈడీ అరెస్ట్ చేసింది. మూడు రోజులుగా ఈ ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

 Delhi liquor scam: Enforcement Directorate  Arrested Sharath Reddy and Vinay babu
Author
First Published Nov 10, 2022, 9:15 AM IST

న్యూఢిల్లీ:ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురువారంనాడు మరో ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శరత్ రెడ్డి,వినయ్ బాబులను ఈడీ ఇవాళ అరెస్ట్ చేసింది. మూడురోజులుగా ఈడీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు. శశరత్ రెడ్డి అరబిందో ఫార్మా సంస్థ  శరత్ రెడ్డి కీలక బాధ్యతల్లో ఉన్నారని సమాచారం.

ఢిల్లీ లిక్కర్ స్కాంకుసంబంధించి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు గతంలో సోదాలు నిర్వహించారు.ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడ ఈడీ  అధికారులు సోదాలు చేశారు.ఈడీతోపాటు సీబీఐ అధికారులు కూడ విచారణ నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించారు.

ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థ పేరు కూడా ఎఫ్ఐఆర్‌లో ఉంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఈడీ అధికారులు మూడు రోజులుగా శరత్ రెడ్డిని ప్రశ్నించారు.ఇవాళ ఉదయం  ఆయనను అరెస్ట్ చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఈ ఏడాది  సెప్టెంబర్ మాసంలో విచారించారు.

ఢిల్లీ  లిక్కర్ స్కాంలో హైద్రాబాద్ కుచెందిన  అరుణ్ రామచంద్రపిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగాఈడీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు.రాబిన్ డిస్టిలరీస్ సంస్థ కార్యాలయాలతోపాటు ఇతర సంస్థల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు:అభిషేక్ రావు బెయిల్ పిటిసన్లపై విచారణ ఈ నెల14కి వాయిదా

హైద్రాబాద్ కు చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 16,17 తేదీల్లో చార్టెడ్ అకౌంటెంట్ కు చెందిన గోరంట్ల అసోసియేట్స్ పై ఈడీ అధికారులు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తెలంగాణకు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును ఈడీ అరెస్ట్ చేసింది. బోయినపల్లి అభిషేక్ రావుతో పాటు విజయ్ నాయర్ లు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీకి చెందిన దీపక్ ఆరోరా సీబీఐకి అఫ్రూవర్ గా మారారు. దీపక్ ఆరోరా ఈ నెల 14న సీబీఐకి స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా కూడ దర్యాప్తు సంస్థలు విచారణను ముందుకు తీసుకెళ్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios