Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి వెళ్లేవారికి గుడ్ న్యూస్... తెలంగాణా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత...

తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. 

Delhi government Lifts restrictions on Telangana travelers - bsb
Author
Hyderabad, First Published Jun 14, 2021, 11:49 AM IST

తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. 

కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. రిపోర్ట్ లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలని పేర్కొంది.

అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆంక్షలను ఎత్తివేసింది. తాజాగా దేశంలో కోవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతవారం రోజులుగా లక్ష దిగువనే నమోదవుతున్న కేసులు.. నిన్న మరి కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,421 మందికి కరోనా సోకింది. సుమారు 75 రోజుల తరువాత ఈ స్థయి తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం క్రితం రోజుతో పోల్చితే పెరుగుదల కనిపించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది. 

చంద్రబాబుకు రుణపడి ఉంటా: టీఆర్ఎస్ లో చేరికపై తేల్చని ఎల్. రమణ...

నిన్న 14,92,152 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 70,421 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ ఒకటి తరువాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తక్కువగానే ఉండటం కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక నిన్న 3,921 మరణాలు రికార్డయ్యాయి. పలు రాష్ట్రాలు మరణాల లెక్కను సవరిస్తుండటంలో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 2.95కోట్లకు పై బడగా, 3,74,305 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక క్రియాశీల కేసులు 10 లక్షల దిగువకు పడిపోగా.. రికవరీలు 2.81కోట్లకు పైబడ్డాయి. నిన్న ఒక్కరోజూ 1,19,501 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.43 శాతానికి పెరగగా.. క్రియాశీల రేటు 3.30శాతానికి తగ్గింది. మరోపక్క 14,99,771మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు అందిన టీకాల సంఖ్య 25,48,49,301గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios