Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ ఫ్రాడ్ కేసు: అమెరికా వెళ్తుంటే సుజనాకు చేదు అనుభవం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని అధికారులు అడ్డుకొన్నారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఎంపీ సుజనా చౌదరికి  లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
 

Delhi airport officials stops former minister sujana chowdary lns
Author
Hyderabad, First Published Nov 13, 2020, 5:09 PM IST


ఢిల్లీ ఎయిర్ పోర్టులో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని శుక్రవారం నాడు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకొన్నారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో ఎంపీ సుజనా చౌదరికి  లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి సుజనా చౌదరి ప్రయత్నించారు. అయితే బ్యాంక్ ఫ్రాడ్ కేసులో లుక్ అవుట్ నోటీసు జారీ చేయడంతో సుజనా చౌదరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకొన్నారు. 

లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో దేశం విడిచి వెళ్లడానికి అధికారులు అభ్యంతరం చెప్పారు. లుకౌట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టును ఎంపీ సుజనా చౌదరి ఆశ్రయించారు.ఉద్దేశ్యపూర్వకంగానే తనను అమెరికాకు వెళ్లకుండా అడ్డుకొన్నారని ఆయన ఆ పిటిషన్ లో ఆరోపించారు. బ్యాంకు రుణాల చెల్లించకపోవడంతో సుజనా చౌదరి ఆస్తులను విక్రయిస్తామని బ్యాంకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది జూన్ 2వ తేదీప సీబీఐ అధికారులు సుజనా కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని.. వాటిని ఎగ్గొట్టారని బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ ఎండి తో పాటు నలుగురు డైరెక్టర్లపై సీబీఐ 2017లో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios