యూనివర్సిటీ రిజిష్ట్రార్‌లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై సమావేశంలో నిర్వహించారు. సెప్టెంబర్ 14 నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

వెసులుబాటును పట్టి ఒక్రటెండు రోజులు అటుఇటుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల షెడ్యూల్‌ను రెండు రోజుల్లో యూనివర్సిటీలు విడుదల చేసే అవకాశం వుంది.

అయితే  పీజీ పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు వీలుకాదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అక్టోబర్‌లో నిర్వహించేందుకు యూజీసీ అనుమతి కోరాలని నిర్ణయించారు.

మరోవైపు డిగ్రీ బ్యాక్ లాగ్ పరీక్షలను కూడా అక్టోబర్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీలు సిద్ధంగా ఉంటే పీజీ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చునని ఉన్నత విద్యా మండలి సూచించింది.