సిద్దిపేట: సిద్దిపేట కరోనా ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న రోగి బుధవారం రాత్రి మరణించాడు, దీంతో ఇదే వార్డులో చికిత్స పొందుతున్న రోగులు భయాందోళనలు చెందుతున్నారు.

సిద్దిపేట కరోనా ఆసుపత్రిలో ఓ వ్యక్తి  చికిత్స కోసం చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం నాడు రాత్రి కరోనా సోకిన వ్యక్తి మృతి చెందాడు.

బుధవారం నాడు మరణించినా కూడ గురువారం నాడు ఉదయం వరకు అతడిని అదే వార్డులో అలానే ఉంచారు. దీంతో ఇదే వార్డులో చికిత్స పొందుతున్న  రోగులు భయపడుతున్నారు. 

also read:గాంధీలో మరో దారుణం: ఆక్సిజన్ కొరతతో కరోనా రోగి మృతి

కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వార్డు నుండి తరలించాలని ఇదే వార్డులో చికిత్స పొందుతున్న రోగులు కోరుతున్నారు. 

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రోగులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని గుర్తించి వెంటనే మార్చురీకి తరలించకుండా తాత్సారం చేశారని రోగులు విమర్శిస్తున్నారు.డెడ్ బాడీని చూస్తూ తాము ఎలా ట్రీట్ మెంట్ తీసుకొంటామని  రోగులు ప్రశ్నిస్తున్నారు.