చీటింగ్ కేసులో కన్నతండ్రిని అరెస్ట్ చేయించింది కూతురు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ న్యూనల్లకుంటకు చెందిన వైద్యుడి మొదటి భార్య తనను వేధిస్తున్నాడంటూ 2003లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రాజీ కుదుర్చుకునేందుకు ముందుకొచ్చిన వైద్యుడు భార్యాపిల్లల అవసరాలతో పాటు కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల రూ.5 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు.

దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత సదరు దంతవైద్యుడు కోర్టు అనుమతితో విడాకులు తీసుకున్నాడు. అయితే తన తల్లికిచ్చిన మాటను తప్పాడంటూ కుమార్తె తండ్రిపై చీటింగ్ కేసు పెట్టింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం డెంటిస్ట్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.