Asianet News TeluguAsianet News Telugu

తల్లీబిడ్డలపై కత్తులతో దాడి కేసును చేధించిన పోలీసులు.. ఆస్తికోసం కన్నకూతురే ప్లాన్ చేసి మరీ..

ఆస్తికోసం భర్త, మామలతో కలిసి ప్లాన్ వేసి సొంత తల్లిని హత్య చేయించింది ఓ కూతురు. ఈ కేసును కరీంనగర్ పోలీసులు చేధించారు. 

daughter assassinated mother with the help of husband and uncle in karimnagar
Author
First Published Oct 8, 2022, 12:51 PM IST

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో జరిగిన మహిళ హత్యను పోలీసులు చేధించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసమే సొంత కూతురు, అల్లుడు పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పండగ కోసం తల్లిగారి ఇంటికి వచ్చినట్టు నమ్మించి కూతురు, అల్లుడు, వియ్యంకుడు కలిసి కిరాయి గుండాలతో తల్లి సులోచనను హత్య చేయించారని తేలింది. మృతురాలు సులోచన భర్త 20 ఏళ్ల కిందట చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది.

తమ ఆస్తి పై కన్నేసిన కూతురు, అల్లుడు, వియ్యంకుడు ఈ దారుణానికి తెగబడ్డారు. మృతురాలి కూతురు అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుండి కుటుంబంలో కలహాలు మొదలైన మొదలయ్యాయి. సులోచన హత్య సమయంలో..అడ్డొచ్చిన సులోచన తల్లి రాధవ్వకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హత్య చేసేందుకు దుండగులు ఇంట్లోకి వచ్చే ముందు మృతురాలి కూతురే తలుపులు తీసినట్టు నిందితులు పోలీసులకు వెల్లడించారు. 

కాగా, మగదిక్కు లేకుండా జీవిస్తున్నతల్లీబిడ్డలపై ఇంట్లోకి చొరబడి మరీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో కూతురు అక్కడికక్కడే మృతిచెందగా తల్లి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ కు చెందిన గుజ్జుల సులోచన(45) ఇరవయ్యేళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా మారింది. దీంతో తల్లి రాధవ్వ(75)తో కలిసి పుట్టింట్లోనే వుంటోంది. 

అయితే గత అర్థరాత్రి తల్లీబిడ్డలు ఇంట్లో గాఢనిద్రలో వుండగా కత్తులతో ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సులోచన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా రాధవ్వ తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో వున్నారు. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios