ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గెలిచే పరిస్థితులు లేవని కేంద్ర మాజీ మంత్రి,బీజేపీ  సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని.. దాని వల్ల బీజేపీకి లాభమే తప్ప నష్టం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీగానీ, ఫెడరల్ ఫ్రంట్ గానీ బీజేపీతో సరితూగే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. తమ పార్టీ 300సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్ లో కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకోవాలని ఈ సందర్బంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.