విత్తన కంపెనీలకు కెసిఆర్ దాసోహం ప్రయివేటు అవార్డును కేంద్ర సంస్థ ఇస్తున్నట్లుగా ప్రచారం ఆ అవార్డు ఇచ్చేది ఒక విత్తన బ్రోకర్ ప్రయివేటు అవార్డుకు అంత హడావిడి ఎందుకు? స్వామినాథన్ కు లేఖ రాస్తాం
తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోమారు ఫైర్ అయ్యారు టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్. ఆయన ఆదివారం నల్లగొండ పిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్య గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. విత్తన కంపెనీలకు కెసిఆర్ దాసోహం అయిండు కాబట్టే వ్యవసాయ నాయకత్వ అవార్డు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చే వాడికి ఇంగితం లేదు.. తీసుకునేవాడికి బుద్ది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు ఇస్తున్నట్టు భారతీయ ఆహార వ్యవసాయ మండలి ప్రకటించడం ఒక పెద్ద కుట్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా భ్రమింపజేసి, ప్రజలను తప్పుదోవ పట్టించింది. నూటికి నూరు శాతం ఈ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ. దీనికి ఎం.జె ఖాన్ అనే వ్యక్తి చైర్మన్. ఆయన ఒక విత్తన కంపెనీల బ్రోకర్. తెలంగాణను సీడ్ బోల్ గా చేస్తామనే కుట్రలో ప్రైవేట్ విత్తన కంపెనీలకు దోచి పెట్టేందుకు ముఖ్యమంత్రికి అవార్డు ప్రకటించారు. ఇదొక ఇది పనికిరాని చెత్త అవార్డు అని విమర్శించారు.
భారతీయ ఆహార వ్యవసాయ మండలి ఒక ప్రైవేట్ సంస్త దాని చైర్మన్ ఎం.జె ఖాన్ ఒక విత్తన కంపెనీల బ్రోకర్ తెలంగాణలో విత్తనాల కంపెనీలను దించడానికి, నకిలీ విత్తనాలతో రైతులను ముంచడానికి, జన్యు విత్తనాలను తెలంగాణలో సరఫరా చేయడానికి చేస్తున్న కుట్రలో భాగంగా ఖాన్ ఈ అవార్డు కేసిఆర్‌కు ప్రకటించారని అంతేకానీ తెలంగాణలో కేసిఆర్ ఏదో వ్యవసాయానికి గొప్ప చేయడం వల్ల వచ్చింది కాదని విమర్శించారు.
దేశంలోనే తెలంగాణ రైతు ఆత్మహత్యలలో నెంబర్ 2 గా ఉందని అంతేకాకుండా తెలంగాణలో 3500 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి జిల్లా సిద్దిపేట రెండో స్థానంలో ఉండగా కేసిఆర్ నియోజకవర్గం గజ్వెల్ తెలంగాణలో మొదటి స్థానంలో ఉందన్నారు. 36 లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు, బంగారు ఆభరణాలు ఇంకా బ్యాంకులలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణను సీడ్ బోల్‌గా మారుస్తామని ఎన్నికల ముందు చెప్పిన కేసిఆర్ నకిలీ విత్తన కంపెనీలకు బార్ల తెరిసి నకిలి విత్తన బోల్‌గా మార్చరని రైతులు తీవ్రంగా నష్టపోయినా కూడా ఒక్క విత్తన కంపెనీపైన చర్యలు తీసుకోలేదని అందుకు కేసిఆర్‌కు అవార్డు ఇస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చిన 790 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సీడీ నిధులను తన మిషన్ భగరథకు తరలించి కమీషన్లు దండుకున్నందుకు అవార్డు ఇవ్వాలా..?
ప్రజా ప్రయోజనాల కోసం యుపిఎ ప్రభుత్వం తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని ఇష్టానుసారంగా ఒక బ్రోకర్ లాగా సాగునీటి ప్రాజెక్టలు, ఫార్మా ప్రాజెక్టుల పేరిట లక్షల ఎకరాల భూమిని రైతులనుంచి గుంజుకొని వారికి భూమి లేని వారికి చేసినందుకు అవార్డు ఇవ్వాలా.. రైతు కూలీలకు అక్షయపాత్ర లాగా, కామ దేనువు లాగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చి కూలీలకు ఇవ్వాల్సిన కూలీ డబ్బులను సకాలంలో ఇవ్వకుండా వారి పనిదినాలు తగ్గించి వారి ఆకలి మంటలకు కారణమైనందుకు కేసిఆర్‌కు ఈ అవార్డు ఇవ్వాలా అని వారు ప్రశ్నించారు.
వ్యవసాయ శాస్త్ర వేత్త ఎం.ఎస్ స్వామినాథన్ అంటే కాంగ్రెస్ పార్టీ అపారమైన గౌరవం ఉందని తెలంగాణలో ఎలాంటి వ్యవసాయం ఉందో, రైతుల పరిస్థతి ఎలా ఉందో, ప్రభుత్వానికి ఆయన చేసిన సిఫారసులు ఇక్కడ ఏమైనా అమలు అవుతునా్నయో లేదో అని తెలుసుకోవడానికి తెలంగాణకు స్వామినాథన్ రావాలని తాము కోరుతున్నామని ఈ అంశాలతో ఆయనకు లేఖ రాస్తున్నామని వారు తెలిపారు.
