Asianet News TeluguAsianet News Telugu

దసరా సెలవులు ప్ర‌క‌టించిన తెలంగాణ‌ ప్ర‌భుత్వం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..?

తెలంగాణ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఈ ఏడాది దసరా పండుగ సంద‌ర్భంగా ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్ర‌క‌టించింది.

Dasara holidays from September 26 to October 9 in Telangana
Author
First Published Sep 13, 2022, 2:35 PM IST

తెలంగాణ విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంవ‌త్స‌రం దసరా పండుగ‌కు భారీగా  సెల‌వులను ప్ర‌క‌టించింది. అక్టోబర్ 5 న దసరా పండుగ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈ నెల 26 వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులుగా ప్ర‌క‌టించింది. అయితే.. సెప్టెంబర్ 25 ఆదివారం, అక్టోబర్ 9 ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవులు రానున్నాయి. విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీన అంటే సోమవారం పునః ప్రారంభం కానున్నాయ‌ని విద్యా శాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.

గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చిన నేప‌థ్యంలో..  9,10 తరగతి విద్యార్థుల‌కు సెలవులు తగ్గించాలని యోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, తాజాగా ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో వారి కూడా మొత్తం 15 రోజుల సెలవులు వ‌చ్చాయి. ప్రభుత్వ ప్రకటనతో ఆ ప్రచారానికి తెర పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios