Asianet News TeluguAsianet News Telugu

26న దసరా సెలవు: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

దసరా పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దసరా పర్వదినం అదివారమా, సోమవారమా అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆ స్పష్టత ఇచ్చింది.

Dasara holiday is changed to October 26
Author
Hyderabad, First Published Oct 23, 2020, 7:30 PM IST

హైదరాబాద్: దసరా పర్వదినం సెలవుపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దసరా ఈ నెల 25వ తేదీననా, 26వ తేదీననా అనే వివాదం నెలకొన్న నేపథ్యంలో క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత సెలవు దినాన్ని మార్చింది. 

ఇంతకు ముందు ఈ నెల 25వ తేదీన దసరా సెలవు దినంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత విజయ దశమి సెలవు దినాన్ని 25వ తేదీ నుంచి 26వ తేదీకి మార్చినట్లు తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ మేరకు గెజెట్ లో ప్రకటించింది. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సద్దుల బతుకమ్మ శనివారం జరుగుతుంది. సద్దుల బతుకమ్మకు, దసరాకు మధ్య ఓ రోజు వ్యవధి ఉండడం సాధారణం.

సద్దుల బతుకమ్మ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రేపు శనివారం కూడా సెలవే. తెలంగాణలో బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios