కవితకు ఓటమి భయం పట్టుకుంది, అందువల్లే నాన్నపై చర్యలు : డి. అరవింద్

Darmapuri aravind reacts on ds issue in nizamabad
Highlights

డీఎస్ వ్యవహారంపై తనయుడి స్పందన...

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ తన తండ్రికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై డి. అరవింద్ స్పందించారు. నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని ఆయన అన్నారు. అందువల్లే ఆమె జిల్లాలోని సీనియర్ నాయకులను టార్గెట్ చేసుకున్నారని, అందులో బాగంగా మొదటి వ్యక్తిగా రాజ్యసభ సభ్యులు డీఎస్ ను ఎంచుకున్నారని తెలిపారు. ఆమె నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో జిల్లాకు పనికొచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని అరవింద్ ప్రశ్నించారు. 

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కలిసి డిఎస్ కు వ్యతిరేకంగా ఇవాళ కవిత క్యాంప్ ఆపీసులో బైటీ అయిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి పార్టీకి వ్యతిరేకంగా డీఎస్ ఎలా పనిచేస్తున్నారో వివరిస్తూ నాలుగు పేజీల లేఖను ఎంపీ కవితకు అందజేశారు. దీన్ని పరిశీలించి అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు వివరించాలని కవితను వారు కోరారు. దీంతో డీఎస్ పై దాదాపు వేటు ఖాయమైనట్లు సమాచారం.

దీంతో డీఎస్ కూడా తన ప్రయత్నాలను కూడా ముమ్మరం చేశారు. నిజామాబాద్ లోని తన అనచురులతో డీఎస్ కూడా చర్చలు జరిపారు. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికల గురించి వారితో చర్చించినట్లు సమాచారం.

అయితే కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే డీఎస్ టీఆర్ఎస్ పార్టీని బలిచేస్తున్నారని కవిత ఆరోపించడాన్ని బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ తప్పుబట్టారు. అసలు ఈ నాలుగేళ్లలో ఎంపీ కవిత జిల్లాలో కనబడనే లేదని విమర్శించారు. డీఎస్ టీఆర్ఎస్ లో చేరిన తర్వాతే ఆమె వెలుగులోకి వచ్చారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్వయంగా కార్యకర్తలే డీఎస్‌కు లేఖలు ఇచ్చారని అన్నారు. దీన్ని బట్టే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకుంటారని అరవింద్  స్పష్టం చేశారు.

loader