Asianet News TeluguAsianet News Telugu

ఖైరతాబాద్ గణేశుడి వద్ద అపచారం.. చెప్పులు వేసుకొని పూజలో పాల్గొన్న దానం నాగేందర్.. నెటిజన్ల ఆగ్రహం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేషుడి పూజలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఆయన చెప్పులు వేసుకొని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Danam Nagender who participated in puja at Khairatabad Ganesha wearing sandals.. Netizens are angry
Author
First Published Sep 8, 2022, 10:17 AM IST

ఎంతో ప‌విత్రంగా పూజ‌లు అందుకుంటున్న ఖైర‌తాబాద్ గ‌ణేషుడి వ‌ద్ద అప‌చారం జ‌రిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పులు వేసుకొని పూజ‌లో పాల్గొన్నారు. దీంతో ఆయ‌న‌పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. నెటిజ‌న్ల‌ను ఆయ‌న‌ను విమ‌ర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. హిందూ భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

పల్లా వెనక్కి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

హైద‌రాబాద్ లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరాతాబాద్ గ‌ణేషుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. దాదాపు 68 ఏళ్ల నుంచి ఇక్క‌డ గ‌ణేషుడిని ప్ర‌తిష్టిస్తున్నారు. ప్ర‌తీ ఏటా వినాయ‌కుడి విగ్ర‌హం ఎత్తు పెంచుతూ వ‌స్తున్నారు. అతి భారీ రూపంలో ఉండే ఈ గ‌ణ‌నాథుడిని చూడ‌టానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు వ‌స్తుంటారు. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి హానీ క‌లుగుతోంద‌నే ఉద్దేశంతో గ‌త కొన్ని ఏళ్లుగా మ‌ట్టితోనే విగ్ర‌హాన్ని త‌యారు చేస్తున్నారు. ఈ సారి కూడా 50 అడుగుల మ‌ట్టి విగ్ర‌హాన్ని రూపొందించారు. 

నీట్ ఫలితాలు : టాప్ 50లో 8మంది తెలుగు విద్యార్థులు.. తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావుకు 5వ ర్యాంకు...

ప్ర‌తీ సారి వినాయ‌క విగ్ర‌హం పైకి ఎక్కి వీఐపీలు, ఉత్స‌వ క‌మిటీ స‌భ్యులు, ఇతర ముఖ్య‌మైన వ్య‌క్తులు పూజ‌లు చేసేవారు. కానీ ఈ సారి అలాంటివేమీ జ‌రకుండా నిర్వాహ‌కులు జాగ్ర‌త్త ప‌డ్డారు. గ‌ణ‌నాథుడిపైకి ఎక్క‌డానికి ఎవరికీ అనుమతి ఇవ్వ‌లేదు. అంద‌రూ వినాయ‌కుడి పాదాల వ‌ద్దే పూజ‌లు చేసేలా ఏర్పాట్లు చేశారు. విగ్ర‌హాన్ని ఎవ‌రూ తాకుండా ప‌విత్రంగా చూసుకుంటున్నారు. దీనికి భ‌క్తులు కూడా స‌హ‌క‌రిస్తున్నారు. అంత ప‌విత్రంగా పూజ‌లు అందుకుంటున్న ఖైర‌తాబాద్ గ‌ణేషుడి వ‌ద్ద అప‌విత్రం జ‌రిగింద‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

అసలేం జ‌రిగిందంటే..? 
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత బుధ‌వారం ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆమె వెంట అనుచ‌రులు, నాయ‌కుల‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే అయిన దానం నాగేంద‌ర్ కుడా ఉన్నారు. అయితే ఈ పూజ‌లో పాల్గొన్న స‌మ‌యంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకొనే ఉన్నారు. ఈ విష‌యం ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. క‌విత త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఖైరతాబాద్ గణేషుడి ద‌ర్శ‌నం, పూజా కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేశారు.

 

ఆ ఫొటోల్లో దానం నాగేంద‌ర్ చెప్పులు వేసుకొని ఉన్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేవుళ్ల ద‌గ్గ‌ర చెప్పులు ఎలా వేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఆయ‌న తీరుపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. భ‌క్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. మ‌రి ఈ విష‌యంపై దానం నాగేంద‌ర్ ఎలా స్పందిస్తార‌నేది వేచి చూడాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios