దానం నాగేందర్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Danam Nagender Biography: తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయన అందరికీ సుపరిచితం. పార్టీలతో సంబంధం లేని ప్రజానాయకుడు. గ్రేటర్ లో ఏ సెగ్మెంట్ అయినా రాజకీయంగా తిరుగులేని నేత. ఆయనే కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత దానం నాగేందర్. గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ లో ఆయన పేరు నిత్యం వినిపిస్తుంది. ఆ పొలిటికల్ లీడర్ మాస్ లీడర్ దానం నాగేందర్ బయోగ్రఫీ మీ కోసం..
Danam Nagender Biography: తెలంగాణ రాజకీయాల్లో మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయన అందరికీ సుపరిచితం. పార్టీలతో సంబంధం లేని ప్రజానాయకుడు. గ్రేటర్ లో ఏ సెగ్మెంట్ అయినా రాజకీయంగా తిరుగులేని నేత. ఆయనే కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత దానం నాగేందర్. గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ లో ఆయన పేరు నిత్యం వినిపిస్తుంది. ఆ పొలిటికల్ లీడర్ మాస్ లీడర్ దానం నాగేందర్ బయోగ్రఫీ మీ కోసం..
జననం, విద్య
దానం నాగేందర్ 1964 ఆగస్టు 9న లింగమూర్తి లక్ష్మీబాయి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. ఆయన చదమంతా హైదరాబాదులోనే సాగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MA) పూర్తిచేశాడు. చిన్నతనం నుంచి ఆయనకు రాజకీయాలంటే ఆసక్తి .అంతే కాదు వారి కుటుంబం కూడా రాజకీయాల్లోనే ఉంది. తండ్రి, తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్స్. ఇక వారి పెద్దనాన్న హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేస్తారు. రాజకీయంగా వారి కుటుంబం మూడు తరాలుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఆనాటి బడా లీడర్లలంతా వారి కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవి.
రాజకీయ జీవిత చరిత్ర
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ ఆనతికాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగారు. 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2004లో ఆసిఫ్‌నగర్ నుండి టిడిపి టికెట్‌పై గెలిచారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చర్చలు జరిపి తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో టీడీపీకి, తన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి.. కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నాడు. వైఎస్ఆర్ మరణానంతరం కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో కూడా అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగాడు.
టీడీపీలో చేరిక
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. కానీ, సమీప బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 20,846 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. పార్టీలో జరిగిన సంస్థాగత మార్పులతో 2018, జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా (టీఆర్ఎస్) కప్పుకున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి
ఇక 2023లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి గెలుపొందారు. కానీ, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడంతో 2024 మార్చి 17న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి & టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో స్వంత గూటికి(కాంగ్రెస్)లో చేరాడు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ బరిలో నిలిచారు.