కాంగ్రెసుకు మరో షాక్: గులాబీ గూటికి దామోదర?

damodara rajanarsimha, congress, andole, telangana
Highlights

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెసుకు రాంరాం చెప్తారని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెసుకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దానం నాగేందర్ కారెక్కారు. 

సిద్ధిపేట: తెలంగాణలో కాంగ్రెసుకు మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దానం నాగేందర్ కారెక్కారు. మరో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెసుకు రాంరాం చెప్తారని అంటున్నారు. 

గత ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ ఆందోల్ నుంచి కాంగ్రెసు టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. సినీ నటుడు బాబూ మోహన్ ఆయనపై టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే, బాబూ మోహన్ పై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ స్థితిలో దామోదర రాజనర్సింహ టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 

చాలా కాలంగా దామోదర కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తనను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన భావిస్తున్నారు. 

అదే సమయంలో తన సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే సంపత్ ను ఎఐసిసి కార్యదర్శిగా నియమించడంపై కూడా దామోదర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

loader