తన కుటుంబంపై కుట్ర చేశారని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. తన భార్య పద్మినీరెడ్డి బీజేపీలోకి వెళ్లడంపై పరోక్షంగా స్పందించిన రాజనర్సింహ అదంతా ఓ కుట్ర అన్నారు. కుట్రతో రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. 

హైదరాబాద్: తన కుటుంబంపై కుట్ర చేశారని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. తన భార్య పద్మినీరెడ్డి బీజేపీలోకి వెళ్లడంపై పరోక్షంగా స్పందించిన రాజనర్సింహ అదంతా ఓ కుట్ర అన్నారు. కుట్రతో రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. 

నాకుటుంబంపై చేసిన కుట్రను సమయం వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ప్రజల తిరుగుబాటుతో నియంతలు చరిత్రలో కలిసిపోయారని గుర్తు చేశారు. మరోవైపు ఈనెల 23 లోగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. విశ్వసనీయతతో కూడిన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమన్నారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబంలో అసహనం పెరిగిందని దామోదర అభిప్రాయపడ్డారు.