Asianet News TeluguAsianet News Telugu

దళిత మహిళ లాకప్ డెత్... గవర్నర్ కు ఉత్తమ్, భట్టి లేఖ

దళిత మహిళ లాకప్ డెత్ కు సంబంధించి దోషులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఉత్తమ్, భట్టి లేఖ రాశారు. 

Dalit woman lockup death... Uttam  Bhatti writen letter to Governor akp
Author
Hyderabad, First Published Jun 22, 2021, 9:23 AM IST

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల చేతిలో లాకప్ డెత్ కు గురయిన మరియిన దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు గవర్నర్ కు వారు లేఖ రాశారు.  
 
దళిత మహిళ లాకప్ డెత్ కు సంబంధించి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని గవర్నర్ కు రాసిన లేఖలో ఉత్తమ్, భట్టి పేర్కొన్నారు.

read more మరియమ్మ లాకప్ డెత్ : కేసీఆర్ నీకు బుద్దుంటే, నువ్వు మనిషివైతే చంపిన వారిమీద చర్యలు తీసుకో.. భట్టి విక్రమార్క

ఇక ఇప్పటికే ఈ లాకప్ డెత్ పై భట్టి విక్రమార్క ఘాటుగా స్పందిస్తూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద వాళ్ళు, దయనీయ స్థితిలో బతకలేనివాళ్ళపై పోలీసుల హింస పెరిగిపోతోందని...  పోలీసులు ప్రజలను రక్షించడానికి ఉన్నారు కానీ ఇలా హింసించి, ప్రజలపై దౌర్జన్యం చేసి చంపేందుకు కాదన్నారు. మమ్మల్ని ఎవరూ అడిగేవాడు లేడన్న అహంకారపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని భట్టి దుయ్యబట్టారు. 

పోలీసులు ఇలా ప్రవర్తించడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని.. తనను తాను కాపాడుకోవడానికి పోలీసులకు ఇచ్చిన విచ్చలవిడి అధికారాలు, విశృంఖలంగా వాళ్లు చేసే కార్యక్రమాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలను పోలీసులు ఎలా హింసించినా పోలీసులు నన్ను కాపాడితే చాలు అనే విదంగా కేసీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. 

దళిత మహిళ మరియమ్మను హింసించి లాకప్ డెత్ చేసి మూడు రోజులు అవుతోందన్నారు. ఇటువంటి లాకప్ డెత్ ను బయటకు రాకుండా కాపడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరిపైన, వాస్తవాలు బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసిన వారిపైనా, పోలీస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం వాస్తవ పరిస్థితులను బయటకు తీసుకువచ్చి బాధితులను న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోవడానికి అశ్రద్ధే కారణమన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని... జరిగిన సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం భాద్యులైన అందరిపైన, సంఘటన బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసినా వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. భవిష్యత్ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని భట్టి విక్రమార్క అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios