Asianet News TeluguAsianet News Telugu

పంజాగుట్టలో ఉద్రిక్తత... అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై దళిత సంఘాల ఆగ్రహం

హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు తాము దేవుడిలా పూజించే రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ దళిత సంఘాలు పంజాగుట్టలో నిరసన చేపట్టాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే జీహెచ్‌ఎంసీ  అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ చర్యలకు నిరసనగా తాము ఆందోళనకు దిగినట్లు దళిత సంఘాలు తెలిపాయి. 

dalit unions strike at punjagutta
Author
Hyderabad, First Published Apr 13, 2019, 4:35 PM IST

హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు తాము దేవుడిలా పూజించే రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ దళిత సంఘాలు పంజాగుట్టలో నిరసన చేపట్టాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే జీహెచ్‌ఎంసీ  అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ చర్యలకు నిరసనగా తాము ఆందోళనకు దిగినట్లు దళిత సంఘాలు తెలిపాయి. 

అయితే జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం  వల్లే కూల్చివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇందులో తమ తప్పేమీలేదని... నిబంధనల ప్రకారమే విగ్రహాన్ని తొలగించామని వారు తెలిపారు. 

దళిత సంఘాల  ఆందోళన కారణంగా పంజాగుట్ట చౌరస్తాలో భారీగా పోలీసులను మోహరించారు. అయితే తమకు జరిగిన అన్యాయంపై నిరసన తెలిపే హక్కు లేదా అంటూ దళిత సంఘాలకు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా వుండేందుకు పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios