చలో వరంగల్ కు తరలిన దళిత నాయకులు

dalit leaders chalo warangal
Highlights

దుమ్ము దుమారం

ఎస్సీ, ఎస్టీ చట్టం రద్దు పై సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. జూన్ 10వ తేదీన వరంగల్ లో తలపెట్టిన "సింహగర్జన" మహాసభను విజయంవంతం చేయాలని వారు అన్నారు. ఆదివారం జగతగిరిగుట్ట ప్రాంతంలోని ఔట్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం  ఇక్కడినుండి జగతగిరిగుట్ట బస్ స్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించి, పాపిరెడ్డి నగర్ ప్రాంతంలోని అంబెడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో దళితుల పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తొలగించాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాడానికి ప్రతి దళిత కుటుంబం ఓటు హక్కు ద్వారా తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సంగి విజయ, ఎర్ర యాకయ్య, కత్తుల దుర్గయ్య, కుమార్, బత్తుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

loader