ఈ మధ్య పోలీసులు చాలా క్రియేటివ్ గా తయారవుతున్నారు. తాము చెప్పదలుచుకున్నది జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి సులువైన మార్గాలను ఎంచుకుంటున్నారు.  దీనికోసం మీమ్స్ ను కూడా వదలడం లేదు. ఈ క్రమంలోనే పాపులర్ సినిమాల్లో హీరోల ఫోటోలను డైలాగులను వాడుకుంటూ ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని వాడుకున్నారు.

ఇందులో క్రికెటర్ గా దర్శనమిచ్చిన నాని ఫీల్డ్ లో బ్యాట్ పట్టుకుని, ముఖాన హెల్మెట్ పెట్టుకుని ఏ ఫోరో, సిక్సరో బాదడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉండగా మరో ఫోటోలో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. 

ఇది చూసిన అతని కొడుకు గౌతమ్ ‘నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్నా.. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో నాన్నా’ అని సలహా ఇస్తున్నట్లుగా ఉంది. పనిలోపనిగా జాతీయ అవార్డు అందుకున్నందుకు జెర్సీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 

కాగా పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఎవరైనా మీమర్ కు మేరకు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారా సార్? అని కొందరు ఫన్నీగా అడుగుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే చావు కబురు చల్లగా పోస్టర్‌ను కూడా ఫుల్ గా వాడుకున్నారు పోలీసులు.  హెల్మెట్ పెట్టుకోండి బస్తీ బాలరాజు గారూ.. ఎలాంటి కబురు వినాల్సిన అవసరం లేదు.. అని మేం షేర్ చేసిన విషయం తెలిసిందే !