Asianet News TeluguAsianet News Telugu

72 ఇళ్లల్లో చోరీ.. డబ్బుతో లగ్జరీ ఇళ్లు.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

ప్రధాన నిందితుడు చోరీ చేసిన డబ్బుతో విజయవాడలో ఓ ఇంటిని కొన్నట్లు తెలిసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఇల్లు కొనుగోలు చేసేందుకు సహకరించిన ఏపీ భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం అటెండర్‌ను కూడా అరెస్టు చేశారు.
 

Cyberabad police arrest the theft in hyderabad
Author
Hyderabad, First Published Jul 28, 2020, 11:45 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గత కొంతకాలంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ దొరకకుండా తప్పించుకుతిరుగుతున్నగజ దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 72ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ చేసుకొని మరీ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ కేసును విచారించిన పోలీసులు...నిందితుడు మేకల వంశీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. చోరీ సొత్తును దాచేంటుకు సహకరిస్తున్న భార్యతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

ప్రధాన నిందితుడు చోరీ చేసిన డబ్బుతో విజయవాడలో ఓ ఇంటిని కొన్నట్లు తెలిసిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఇల్లు కొనుగోలు చేసేందుకు సహకరించిన ఏపీ భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం అటెండర్‌ను కూడా అరెస్టు చేశారు.

నిందితుడి దగ్గరి నుంచి రూ.53.35 లక్షల నగదుతో పాటు దొంగతనం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన దాదాపు రూ.8.50 లక్షల విలువ చేసే 20 తులాల బంగారు ఆభరణాలు, ఓ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఒక ద్విచక్ర వాహనం, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇతను 72 చోరీలకు పాల్పడినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇతనిపై చోరీ కేసులు ఉన్నాయి. బెంగళూరులోనూ రెండు చోరీలకు పాల్పడినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios