పూనమ్, లక్ష్మీ పార్వతిలను టార్గెట్ చేసింది ఒక్కరే

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, May 2019, 9:42 AM IST
cyber crime police identified the person who harassed poonam and lakshmi parvathi
Highlights

సినీ నటి పూనమ్ కౌర్, వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతిపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ వీరిద్దరినీ టార్గెట్ చేసింది ఒక్క వ్యక్తేనని ఆలస్యంగా తెలిసింది. 


సినీ నటి పూనమ్ కౌర్, వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతిపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ వీరిద్దరినీ టార్గెట్ చేసింది ఒక్క వ్యక్తేనని ఆలస్యంగా తెలిసింది. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్థారించారు. 

తమను కించపరిచే విధంగా ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానళ్లలో అశ్లీల కథనాలు పోస్టు చేస్తున్నారని  లక్ష్మీ పార్వతి, పూనం కౌర వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేవారు. పూనం కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్న ఒక పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. 

ఇతడితో పాటు మరో వ్యక్తి కి ఈ నేరంలో భాగం ఉన్నట్లు గుర్తింాచరు.  హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని ఒక పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

loader