ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో పలువురికి మేసేజ్ లు పంపారు. డబ్బులు పంపాలని పంపిన మేసేజ్ ను చూసి ఓ వైద్యుడు సైబర్ నేరగాళ్లు పంపిన సైబర్ ఖాతాకు డబ్బులు బదిలీ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్టుగా గుర్తించాడు.  ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేశాడు. 


ఆదిలాబాద్: విఐపీలు, ప్రముఖులు, అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కొందరు మోసపోతున్నారు. 

ఇలాంటి ఘటనే ఒకటి Telanganaరాష్ట్రంలో చోటు చేసుకొంది.   ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ డీపీగా కలెక్టర్  Sikta Patnaik పోటో పెట్టుకొని నిందితుడు పలువురు వైద్యులు, అధికారులకు డబ్బులు పంపాలని మేసేజ్ పంపాడు. 

ఈ మేసేజ్ ను చూసిన కొందరు క్రాస్ చేసుకోకుండా సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపారు. Adilabad జిల్లాకు చెందిన ఓ వైద్యుడు Cyber నేరగాళ్లు పంపిన Bank ఖాతాకు రూ. 30 వేలు బదిలీ చేశాడు. ఆ తర్వాత తాను మోసపోయానని ఆ వైద్యుడు గుర్తించాడు. వెంటనే  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందిన నాటి నుండి సైబర్ నేరాలు మరింతగా పెరిగిపోయాయి. జార్ఖండ్, బెంగాల్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ తరహాలోనే పలువురి నుండి డబ్బులు వసూలు చేసిన ఘటనలు నమోదయ్యాయి.  ఫేస్ బుక్ , వాట్సాప్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు.

పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లతో కూడా నిందితులు డబ్బులు వసూలు చేసిన ఘటనలున్నాయి. ఫోన్ కు మిస్ట్ కాల్ ఇచ్చి డబ్బులు కొల్లగొట్టిన ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి. అంతేకాదు బ్యాంకు ఖాతాలకు కేవైసీని అప్ డేట్ చేయాలంటూ లింక్ లు పంపి డబ్బులు స్వాహా చేశారు. నకిలీ కాల్ సెంటర్లు నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఫేస్ బుక్ ద్వారా తమ స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపాలని సమాచారం పంపడంతో డబ్బులు పంపి మోసపోయిన ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి. ఎన్ఆర్ఐల  ప్రొపైలను ఆధారంగా నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులు వసూలు చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి.