Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నగర కమిషనర్ గా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్ ల బదిలీలు..

తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా రానున్నారు. 

CV Anand as Hyderabad City Commissioner
Author
Hyderabad, First Published Dec 25, 2021, 7:38 AM IST

హైదరాబాద్ : Hyderabad City Commissioner గా CV Anand నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న అంజనీ కుమార్ ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ)డీజీగా బదిలీ అయ్యారు. తెలంగాణలో భారీ ఎత్తున IPS అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మందికి స్థానచలనం అయ్యింది. 

హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ లతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. సీనియర్ ఐపీఎస్ లతో పాటు సిద్దిపేట, నిజమాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. 

మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తరువాత ఇప్పటివరకు మళ్లీ ఈ స్థాయిలో బదిలీలు చేపట్టలేదు. తాజా బదిలీల్లో నగర పోలీస్ కమిషనర్ గా నియమితులైన సీవీ ఆనంద్ 2018 ఏప్రిల్ లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆయన మూడున్నరేళ్ల కిందట తెలంగాణ కేడర్ కు బదిలీపై వచ్చారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్ గా ఉన్న మహేష్ భగవత్ కు స్థానచలనం కలగకపోవడం గమనార్హం. 

మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థుల డ్రైవింగ్.. బైక్‌తో యాక్సిడెంట్.. మహిళ దుర్మరణం

తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా రానున్నారు. ఏసీబీ డైరెక్టర్‌గా షిఖా గోయల్‌, హైదరాబాద్‌ సంయుక్త సీపీగా ఏఆర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సంయుక్త సీపీగా ఏవీ రంగనాథ్‌, నల్గొండ ఎస్పీగా రెమా రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా ఎన్‌.శ్వేత, హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీగా జోయల్‌ డెవిస్‌, హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా కార్తికేయ, మెదక్‌ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్‌ క్రైం డీసీపీగా కమలేశ్వర్, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌గా అవినాష్‌ మొహంతి, హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్‌ డీసీపీగా గజరావు భూపాల్‌, హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ కమిషనర్‌గా పి. విశ్వప్రసాద్‌, మహబూబాబాద్‌ ఎస్పీగా శరత్‌ చంద్ర పవార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా ఎన్‌.ప్రకాశ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తెలంగాణా లో 30 ఐపీఎస్ బదిలీలు.. ఎవరెవరు ఎక్కడెక్కడ.. 

హైదరాబాద్ సిపిగా సివి.ఆనంద్ 

Acb డిజిగా అంజనీ కుమార్ 

హైదరాబాద్ జాయింట్ సిపి గా ar. శ్రీనివాస్ 

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా రంగనాథ్ 

నల్గొండ ఎస్పీగా రేమ రాజేశ్వరి 

సిద్దిపేట కమిషనర్ గా శ్వేతా 

వెస్ట్ జోన్ డిసిపి గా జోయెల్ డేవిస్ 

మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని 

నార్త్ జోన్ డిసిపి గా చందన దీప్తినల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి

సిద్దిపేట్ సి పి గా శ్వేత

హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి గా జోయల్ డేవిస్

మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని

సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ గా కల్మేశ్వర్

సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి

హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపి గా చందనా దీప్తి

హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా గజరావు భూపాల్

హైదరాబాద్ ఎస్బిఐ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్

వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి

నిజామాబాద్ సి పి గా నాగరాజు

అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
 

Follow Us:
Download App:
  • android
  • ios