Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో పెరిగిన అత్యాచారాలు , గతేడాది కంటే ఎక్కువ .. సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నివేదిక

హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ రౌండ్ అప్ 2023పై శుక్రవారం నగర పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది నేరాల్లో 2 శాతం పెరుగుదల నమోదైందని సీపీ తెలిపారు. 

crime rate increased in hyderabad says cp srinivasa reddy ksp
Author
First Published Dec 22, 2023, 3:42 PM IST

హైదరాబాద్ సిటీ పోలీస్ యాన్యువల్ రౌండ్ అప్ 2023పై శుక్రవారం నగర పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది నేరాల్లో 2 శాతం పెరుగుదల నమోదైందని సీపీ తెలిపారు. నగరంలో మొత్తం 24,821 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.. దోపిడీలు 9 శాతం, మహిళలపై నేరాలు 12 శాతం పెరిగాయని ఆయన వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే అత్యాచార కేసులు 19 శాతం పెరిగాయని.. చిన్నారులపై గతేడాదితో పోలిస్తే 12 శాతం నేరాలు తగ్గాయని కమీషనర్ పేర్కొన్నారు. 

పలు కేసుల్లో జరిగిన ఆస్తి నష్టం విలువ రూ.38 కోట్లు కాగా.. పొగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ చేశామని సీపీ తెలిపారు. ఈ ఏడాది నగరంలో 79 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్ కేసులు, 4909 చీటింగ్ కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది 2,637 రోడ్డు ప్రమాదాలు.. హత్యాయత్నాలు 262 , చోరీలు 91 నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. 63 శాతం మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయని.. వీరిలో 13 మందికి జీవితఖైదు ఎదుర్కొన్నారని సీపీ పేర్కొన్నారు. 

83 డ్రగ్స్ కేసుల్లో 241 మంది అరెస్ట్ అయ్యారని.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం సైబర్ నేరాలు పెరిగాయని కమీషనర్ వెల్లడించారు. ఈ ఏడాది ఇన్వెస్ట్‌మెంట్ స్కీముల ద్వారా 401 కోట్లు మోసాలు గుర్తించామని.. మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీముల్లో రూ.152 కోట్లు.. ఆర్ధిక నేరాలు 10 వేల కోట్లకు పైగా జరిగాయని కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ వివాదాలు, మోసాల్లో 245 మందిని అరెస్ట్ చేశామని... సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మందిని అదుపులోకి తీసుకున్నామని 18 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ వెల్లడించారు. 

ఇక ట్రాఫిక్‌కు సంబంధించి 37 వేల డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని.. రూ.91 లక్షల్ని జరిమానా కింద విధించామని ఆయన తెలిపారు. 556 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని.. మైనర్ డ్రైవింగ్స్ 1,745 నమోదయ్యాయని కమీషనర్ వెల్లడించారు. ఈ ఏడాది డ్రగ్స్ వినియోగించిన 740 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో 13 మంది విదేశీయులు వున్నారని సీపీ తెలిపారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్‌పై నిఘా పెట్టామని.. మాదక ద్రవ్యాలను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios