హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆ కసాయి తండ్రి కన్న కూతురిపైనే కన్నేశాడు. ఆయన భార్య ఊరెళ్లగానే కన్న కూతురినే కాటేశాడు. సోమవారం రాత్రి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉదయం తల్లికి ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తెలిపింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: కన్న కూతురిని ప్రాణంగా పెంచి పెద్ద చేసి ఓ ఇంటికి ఇవ్వాల్సిన తండ్రి తప్పుడు మార్గంలో వెళ్లాడు. కూతరిపైనే కన్నేశాడు. కాటు వేయడానికి అదును కోసం వేచి చూశాడు. కట్టుకున్న భార్య ఊరెళ్లగానే కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక తన తల్లి రాక కోసం ఎదురుచూసింది. తల్లి తిరిగి ఇంటికి రాగానే జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ తల్లి.. తండ్రిని నిలదీసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసుల వివరాల ప్రకారం, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కిస్మత్‌పూర్‌లో వారు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు 9 ఏళ్ల కూతురు ఉన్నది. కుటుంబ జీవనం సజావుగానే సాగుతున్నది. కానీ, ఆ తండ్రి తలలోనే చెడు ఆలోచనలు దాపురించాయి. కన్న తండ్రిపైనే కామం కళ్లతో చూశాడు. ఇటీవలే తన భార్య ఊరికి వెళ్లింది. ఇదే అదునుగా ఆ కసాయి తండ్రి భావించాడు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో సోమవారం రాత్రి కన్న కూతురిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు.
భార్య తమ బంధువుల ఇంటి నుంచి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి ఇంటికి రాగానే ఉదయం కూతురు తనపై జరిగిన లైంగిక దాడిని గురించి తల్లికి వివరించింది. ఆ తల్లి.. కట్టుకున్న భర్తను నిలదీసింది. భార్య నిలదీయడంతో ఆ భర్త బెదిరింపులకు పాల్పడింది. తాను ఆ తప్పు చేశానని, దమ్ముంటే ఏం చేస్తావో చేసుకో.. అని, దిక్కున్న చోట చెప్పుకోమని ఆ భర్త బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఏకైక మార్గం అని నిర్ణయించుకున్నది. స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల కోసం ఆ చిన్నారిని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై దర్యాప్తు ప్రారంభించారు.
వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వనస్థలిపురం ఓ కాలనీలో వీరు ఉంటున్నారు. అతను ఆటో డ్రైవర్. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.
అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి.. ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళా వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు . వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెల పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు.
