Asianet News TeluguAsianet News Telugu

నిపుణుల అనుభవాలు: ఉద్యోగులను ఎలా ఎంపిక చేసుకుంటారు?

మానవ వనరుల విభాగంలో పనిచేసే అధికారులు ఎలా పనిచేయాలన్న దానిపై టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో వివిధ కంపనీల్లో పనిచేసే మానవ వనరుల అధికారులు, ఉద్యోగులతో ఈ ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది.  

creating value chain in hr programme in hyderabad
Author
Hyderabad, First Published Aug 17, 2018, 4:39 PM IST

మానవ వనరుల విభాగంలో పనిచేసే అధికారులు ఎలా పనిచేయాలన్న దానిపై టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.  క్రియేటింగ్ వాల్యూ చైన్ ఇన్ హెచ్ఆర్ అనే పేరుతో వివిధ కంపనీల్లో పనిచేసే మానవ వనరుల అధికారులు, ఉద్యోగులతో ఈ ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా జరిగింది.  

ఈ సందర్భంగా హెచ్ఆర్ విభాగంతో సుధీర్ఘ అనుభవమున్న సీనియర్ల చేత ప్రసంగ కార్యక్రమాన్ని, ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో హెచ్ఆర్ వృత్తిలో కొనసాగుతున్న వారితో సీనియర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎలా పరిష్కరించాలన్న విషయాలను వివరించారు. తాము పనిచేసే ఆర్గనైజేషన్ కోసం ఉద్యోగులను అపాయింట్ చేసుకునే సమయంలో ఎలా వ్యవహరించాలన్న విషయాలను తమ అనుభవాలను జోడించి వక్తలు చక్కగా వివరించారు.

వ్యవసాయ రంగంలో రైతులు భూమి, వాతావరణం, కాలం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటను వేస్తారని, ఈ పద్దతిలోనే ఉద్యోగుల ఎంపికను చేపట్టాలని వక్తలు తెలిపారు. అంటే రైతు మాదిరిగానే హెచ్ఆర్ కూడా  కంపనీకి అవసరమైన స్కిల్స్, ప్రస్తుతం అతడి ఉపయోగం తదితర విషయాలను దృష్టిలో ఉంచుకుంటే మంచి పలితాలుంటాయని తెలిపారు. అంతేకాకుండా టెక్నాలజీని అందిపుచ్చుకుని దాని ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేసుకోవడంలో మానవ వనరుల విభాగంలోని అధికారులు చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. ఈ విషయంలో వెబ్ పోర్టల్ల సాయాన్ని తీసుకోవాలని అందువల్ల చక్కటి ఫలితం ఉంటుందన్నారు. హెచ్ఆర్ డిపార్టుమెంట్లోని ఉద్యోగులు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉండాలన్నారు.

కేవలం ఉద్యోగుల ఎంపిక మాత్రమే కాదు ఉద్యోగుల పనితీరును  మెరుగు పర్చే స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. అందుకోసం ప్రభుత్వం చేపట్టే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను వాడుకోవాలన్నారు. పనిచేసే కంపెనీని తమ సొంతదిగా భావిస్తేనే  మంచి ఫలితాలు వస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ మానవ వనరుల అధికారులు అరుణ్ రావ్, ప్రదీప్త సాహు, కుమార్ నచికేత, అపర్ణ రెడ్డి, కరణ వెంపాల, దీపక్ దేశ్ పాండే, గీత గోటీలతో పాటు ప్రముఖ కంపనీలకు చెందిన మానవ వనరుల అధికారులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios