తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నారుముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన ఇప్పటికే రెండు మాసాలు అవుతోంది. తనతో పాటు మహమూద్‌ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ సీఎంగా రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ సుధీర్ఘ కాలం పాటు కసరత్తు నిర్వహించారు. ఒకే  రకమైన శాఖలను వీలీనం చేసిన తర్వాత  మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావించారు.

ఒకే రకమైన శాఖల విలీనం కూడ పూర్తైంది. ఈ తరుణంలో  కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఈ నెల 19 వ తేదీని ముహుర్తంగా ఎంచుకొన్నారు.  ఆ రోజు మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.

మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కూడ కేసీఆర్ ముహుర్తాన్ని ఎంచుకొన్నారు. మాఘశుద్ద ఫౌర్ణమి కావడంతో ఆ రోజు మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేసుకొన్నారు.


కేసీఆర్‌తో పాటు మంత్రివర్గంలో 18 మందికి అవకాశం దక్కుతోంది. అయితే తొలి విడతలో 10 మందికి అవకాశం దక్కనుంది. కేసీఆర్ శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహాన్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ  విషయమై చర్చించారు. 

ఈ నెల 19వ తేదీన మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన విషయమై గవర్నర్‌తో ఆయన చర్చించారు. మంత్రివర్గ విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.