హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఘన విజయం సాధిస్తుందని తాజా ప్రీ పోల్ సర్వే ఒక్కటి తేల్చింది. సిపిఎస్ నిర్వహించన ఈ ప్రీ పోల్ సర్వే ఫలితాలను ప్రముఖ తెలుగు టీవీ చానెల్ టీవీ 9 సోమవారం సాయంత్రం ప్రసారం చేసింది. దానిపై చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

ఆ సర్వే ప్రకారం - మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 94 నుంచి 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ పార్టీకి 49.7 శాతం ఓట్లు పోలవుతాయి.  ప్రజా కూటమి 32.3 శాతం ఓట్లతో 16 నుంచి 21 స్థానాలకే పరిమితమవుతుంది. 

బిజెపికి ఒక్క స్థానం మాత్రమే వస్తుంది. ఆ పార్టీకి 9.1 శాతం ఓట్లు వస్తాయి. మజ్లీస్ 2.4 శాతం ఓట్లతో తన ఏడు స్థానాలను తిరిగి గెలుచుకుంటుంది. ఇతరులు ఒక్క స్థానాన్ని గెలుచుకుంటారు. మొత్తం ఇతరులకు 6.5 శాతం ఓట్లు పడుతాయి.