నేటి నుండి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: కీలకాంశాలపై చర్చ

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గసమావేశాలు ఇవాళ్టి నుండి రెండు రోజులపాటు హైద్రాబాద్ లో జరగనున్నాయి.రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర మహసభలో చర్చించనున్నారు.

CPI Telangana  State Executive Committee Meetings  From November 16  inHyderabad

హైదరాబాద్:సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇవాళ్టి నుండి రెండు రోజులపాటు హైద్రాబాద్ లో జరగనున్నాయి. రాష్ట్ర,జాతీయ మహసభల్లో చేసిన తీర్మాణాలపై చర్చించనున్నారు.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికైన తర్వాత  తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లోనే సీపీఐ జాతీయ మహసభలు విజయవాడలో జరిగాయి.దేశంలోని చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై ఈ  సమావేశంలో చర్చించారు.

ఈ మేరకు రానున్న రోజుల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహన్ని ఖరారు చేశారు.ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి సీపీఐ మద్దతును ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్ తో సీపీఐ పొత్తు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ  రాష్ట్రంలోని నల్గొండ,ఖమ్మం ,కరీంనగర్ వంటి జిల్లాల్లో  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసే అవకాశం ఉంది.మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతోపాటు రానున్నరోజుల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్రకార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. సీపీఐ జాతీయ ప్రధాని కార్యదర్శిడి.రాజా రాష్ట్ర కార్యవర్గసమావేశంలో పాల్గొంటారు.

మునుగోడు ఉపఎన్నిక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలు,టీఆర్ఎస్ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్దంగా ఉండాలని కేసీఆర్ కోరారు.మంగళవారంనాడుటీఆర్ఎస్ ఎల్పీ,రాష్ట్ర  కార్యవర్గసమావేశంలో కేసీఆర్ కీలక అంశాలను ప్రస్తావించారు.బీజేపీ ఏరకంగా పార్టీమారాలని నేతలపై ఒత్తిడులు తీసుకువస్తున్న విషయాలను కేసీఆర్ వివరించారు.తన కూతురు  కవితను కూడాబీజేపీలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారని కేసీఆర్ ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios