హైదరాబాద్: తన తండ్రి పువ్వాడ నాగేశ్వర రావు పేరుగానీ, సిపిఐ పేరు గాని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దయచేసి ఎక్కడా ప్రస్తావించవద్దని ఆ పార్టీ నాయకులు నారాయణ కోరారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ తాజాగా కేసీఆర్ నాయకత్వంలో అజయ్ పనిచేస్తున్నారు. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్మేపని చేయకండి 
మంత్రిగారు అంటూ ఎద్దేవా చేశారు. 

''నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శిగా వున్నాను. ఏ నిర్ణయాన్నయినా ఉమ్మడిగానే తీసుకుని అమలుచేశాం. కొన్ని సందర్బాలలో ఆనాటి సిపిఐ  ప్రదాన కార్యదర్సి బర్దన్, సురవరం సుధాకర్ రెడ్డి, రాష్త్ర కార్యవర్గంతో పాటు పువ్వాడ నాగేశ్వర రావు సలహాలతో నిర్ణయాలు తీసుకున్నాం. పువ్వాడ నాగేశ్వర రావు ఆనాడు, ఈనాడు మాపార్టి నాయకులే'' అని స్ఫష్టం చేశారు. 

''ఖమ్మం పార్లమెంటు అభ్యర్దిగా పువ్వాడనే పోటీచేయమని రిక్వెస్ట్ చేశాం. దానికి వారు అంగీకరించారు. అయితే నేనెలా అభ్యర్ది అయ్యాను? ఖమ్మంజిల్లా పార్టి అనుమతి లేకుండా, రాష్ట్ర కార్యదర్శివర్గం తీర్మానం లేకుండా, కేంద్రపార్టి అనుమతి లేకుండా నేను పొటీ చేయగలనా? విజ్ఞతతో ఆలోచించమని ప్రజలను ముఖ్యంగా ఖమ్మం ప్రజలను కోరుతున్నాను'' అన్నారు.

''పార్టి నిబందనల రీత్యా ఇంతకుమించి వివరాలు చెప్పలేను . నాకు అవినీతిని అంటగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతికి పాల్పడివుంటే కేంద్ర కార్యదర్సి వర్గస్తాయికి ఎదగగలనా?'' అని ప్రశ్నించారు. 

వీడియో

"

''కేసీఆర్ కన్నా తానే గొప్పవాడని అని పువ్వాడ బరితెగించి చెప్పుకున్నారు . దానిని కేసీఆర్ పరిశీలించుకోవాల్సిందే. తనపై బిజెపి హత్యాప్రయత్నం చేసిందని  మంత్రి చెప్పారు. ఇది రాజకీయాలకతీతంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. అందరం ఖండించాల్సిన అవసరం కూడా వుంది.మరి ఆ ప్రకారం స్పందన ప్రభుత్వం నుండి వుందా?
'' అని నిలదీశారు. 

''యువకుడుగా రవాణా మంత్రి అయ్యావు.  హిట్ ఆండ్ రన్ యాక్ట్  తీవ్రతను గురించి తెలుసుకోవలసిన కనీస బాద్యత ఆయనపై వుంది. నేను విద్యార్ది దశనుండి సిపిఐలో వున్నాను. కానీ మీరెక్కడ నుండి బయలుదేరారో , ఇప్పుడు ఎక్కడవున్నారో , రేపెక్కడికిపోతారో చెప్పగలరా? సూర్యుడిపై ఉమ్మివేయాలనుకుంటే ఏమవుతుందో నన్నంటే అదే అవుతుందని అజయ్ బాబు గుర్తుంచుకోవడం మంచిది'' అని నారాయణ హెచ్చరించారు.