ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సీజన్ ఎయిర్ లిఫ్ట్ చేయాలని భావిస్తోంది. ఎన్ని వీలైతే అన్ని ఆక్సీజన్ ట్యాంకులను రాష్ట్రానికి రప్పించాలని భావిస్తుంది.

తెలంగాణలోనూ కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 29మంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకీ పరిస్థితులు దారుణంగా మారుతుండటంతో.. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఆస్పత్రిలో కరోనా రోగులకు అందించేందుకు ఆక్సీజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా మరణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఆక్సీజన్ కొరతను తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సీజన్ ఎయిర్ లిఫ్ట్ చేయాలని భావిస్తోంది. ఎన్ని వీలైతే అన్ని ఆక్సీజన్ ట్యాంకులను రాష్ట్రానికి రప్పించాలని భావిస్తుంది. దీనిలో భాగంగా భువనేశ్వర్ ఇతర రాష్ట్రాల నుంచి 8 ట్యాకర్ల ఆక్సీజన్ తీసుకురావాలనే నిర్ణయం తీసుకుంది.

ఈ ట్యాంకర్లు శుక్రవారం తెలంగాణలోకి అడుగుపెట్టనున్నాయి. కాగా.. ఈ ట్యాంకర్ల ఆక్సీజన్ తో కొద్ది రోజుల వరకు కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్సీజన్ అందించవచ్చని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. 

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఆక్సీజన్ ట్యాంకర్లను రక్షణ శాఖకు చెందిన కార్గో విమానల ద్వారా తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో విమానం నుంచి రెండు లేదా మూడు ట్యాంకర్లు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల హెడ్స్ తో సమావేశం నిర్వహించారు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో బెడ్ స్టోరేజ్ పెంచాలని సూచించారు. ప్రస్తుతం ఉన్నదాని కంటే ఒకటిన్నర రెట్లు పెంచాలని సూచించారు.

ఈ ఆక్సీజన్ ట్యాంకర్లను దాదాపు 63 కార్పొరేట్ ఆస్పత్రులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కరోనా మహమ్మారి తెలంగాణ సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ కి కూడా సోకింది. కేసీఆర్.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేటీఆర్.. హోం ఐసోలేషన్ లో ఉన్నారు.