హైదరాబాద్, ఉప్పల్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురి పెళ్లికి సన్నాహాలు చేస్తున్న ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం దు:ఖంలో మునిగిపోయింది. 

ఉప్పల్, భరత్ నగర్ కు చెందిన ఈగ నర్సింగ్ రావు ముదిరాజ్ (48) ఉప్పల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 

మే 13న కూతురి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఐదారు రోజుల క్రితం నర్సింగ్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. దీంతో స్థినిక ఆస్పత్రిలో చేర్పించారు. 

విషాదం... మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ మృతి...

బుధవారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో మరో ఆస్పత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్ లో తీసుకుని బయల్దేరారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా బెడ్స్ ఖాళీ లేవని సమాధానమే వినిపించింది. రాత్రంతా ప్రయత్నించినా ఏ ఆస్పత్రిలోనూ ఆయనను చేర్చుకోలేదు. చివరకు తీసుకెళ్లిన అంబులెన్స్ లోనే తెల్లవారజామున ఆయన కన్నుమూశారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona