Asianet News TeluguAsianet News Telugu

వైశాలి కిడ్నాప్ కేసు : నవీన్ రెడ్డికి రిమాండ్.. గోవాకు చేరుకున్నడిలా, వైజాగ్‌, వరంగల్‌లోనూ కేసులు

ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి కోర్ట్ రిమాండ్ విధించింది. పరారీలో వున్న మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. 
 

court sent remand to naveen reddy in doctor vaishali kidnap case
Author
First Published Dec 14, 2022, 9:24 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డికి కోర్ట్ రిమాండ్ విధించింది. అతనితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తాను వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్ రెడ్డి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. పరారీలో వున్న మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నవీన్ రెడ్డి నల్గొండ నుంచి కర్నూలు , బళ్లారి మీదుగా గోవా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, వైజాగ్‌లో కేసులు వున్నట్లు పేర్కొన్నారు. 

ఇకపోతే.. డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన సూత్రధారి నవీన్ రెడ్డిని గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద నుంచి ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయంపై నవీన్ రెడ్డి కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. తాను చేసింది తప్పేనని, కానీ దాని వెనుక చాలా బాధ దాగుందని వ్యాఖ్యానించాడు. అతని మాట్లాడినట్లుగా వున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read:నేను చేసింది తప్పే.. దాని వెనుక చెప్పలేనంత పెయిన్ : వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి

తనకున్న ఆరోగ్య సమస్యల కారణంగా తాను పోలీసులకు సరెండర్ కాలేదని చెప్పాడు. బ్యాడ్మింటన్‌లో తాను ఆడే కోర్టుకే వైశాలి, ఆమె ఇరుగుపొరుగు వచ్చి ఆడేవారని నవీన్ రెడ్డి చెప్పాడు. తర్వాత వైశాలి ఒక్కటే బ్యాడ్మింటన్ ఆడటానికి వచ్చేదని, అక్కడ ఆమె పరిచయం అయ్యిందని తెలిపాడు. ఆట ముగించిన తర్వాత మిస్టర్ టీ వ్యవహారాల్లో తాను బిజీగా వుండేవాడినని చెప్పింది. బ్యాడ్మింటన్ కోర్ట్‌కు సమీపంలోనే తన టీ స్టాల్ వుండటంతో వైశాలితో కబుర్లు చెబుతూ వుండేవాడినని, కొన్నిరోజులకు ఇద్దరి అభిరుచులు కలిశాయని తెలిపాడు. తన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయని నవీన్ రెడ్డి పేర్కొన్నాడు. దాని వల్ల తన కుటుంబం కూడా బాధపడుతోందని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios