ఒక రోజు పోలీసు కస్టడీకి విక్రం గౌడ్ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించనున్న పోలీసులు విక్రంతోపాటు మరో ముగ్గురు కూడా పోలీసు కస్టడీకి
సానుభూతి కోసం కాల్పుల డ్రామా ఆడిన కాంగ్రెస్ నేత విక్రం గౌడ్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఒకరోజు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రం గౌడ్ ను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నారు. విక్రం గౌడ్ తోపాటు మరో ముగ్గురు నిందితులను కూడా పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నరు.
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన విక్రం గౌడ్ సెల్ఫ్ ఫైరింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజాగా పోలీసులు తమ కస్టడీకి విక్రం గౌడ్ ను తీసుకోనున్నారు. కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. దీంతో అసలు సానుభూతి కోసమేనా? మరేదైనా కోణం దాగి ఉందా అన్నదానిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే నిందితులందరినీ విచారించిన పోలీసులు మరోసారి కోర్టు అనుమతితో విచారణ జరిపి ఆధారాలు సేకరించనున్నారు.
