మంచిర్యాల: నూరేళ్ళు కలిసిమెలిసి  జీవిస్తానని ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న ఆరు నెలలకే భార్య భర్తలు సోమవారం నాడు మరణించారు. ఇవాళ మధ్యాహ్నం మంచిర్యాల ఎ సి సి లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మరణించారు. 

బెల్లంపల్లికి చెందిన రుద్ర స్వరాజ్ కి బసంత్ నగర్ వద్ద బయ్యారం గ్రామానికి చెందిన కృష్ణవేణి 25కు  ఆరు  నెలల క్రితం వివాహం జరిగిందిహైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చేసుకుంటున్నా స్వరాజ్ ఆ ఉద్యోగం ను వదిలి తన తండ్రి సింగరేణి ఉద్యోగం అన్ఫిట్ కావడంతో తనకు ఉద్యోగం వస్తుందని ఆశతో గద్దెరాగడిలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు . సోమవారం మధ్యాహ్నం గద్దరేగడి నుంచి మంచిర్యాలకు తన బైక్ పై వస్తుండగా లారీ ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే దంపతులు ఇద్దరు మృతి చెందారు. 

లారీ టైరు తలలపై వెళ్లడం వల్ల అక్కడికక్కడే మరణించారు. ప్రమాద విషయం తెలుసుకున్న డి సి పి ఉదయ్ కుమార్, సీఐ ముత్తి లింగం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

రోడ్డు ప్రమాదంలో రుద్ర స్వరాజ్, కృష్ణవేణి దంపతులు మృతి చెందడం కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.