హైదరాబాద్ రోడ్లు ఓ జంట ప్రాణాల మీదికి తెచ్చాయి. రోడ్డు మీది గుంతలతో బండి అదుపుతప్పి భార్యభర్తలు ఆర్టీసీ బస్సు కింద పడ్డారు. అదృష్టవశాత్తు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

వివరాల్లోకి వెడితే నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమయత్ నగర్ వై జంక్షన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి దంపతులకు తీవ్ర గాయాలయ్యయి. వీరిద్దరూ దిచక్ర వాహనంపై  వెళ్తుంటగా రోడ్డు గుంతలు ఉండడతో బండి అదుపు తప్పింది.

అప్పుడు అటుగా వస్తున్న ఉప్పల్ డిపో బస్ కిందికి బండి వెళ్లింది దీంతో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న నారాయణ గూడ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లేష్ వెంటనే అప్రమత్తమయ్యాడు. 

వారిద్దరినీ ఎత్తుకొని అటుగా వెళ్తున్న అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించాడు.